Kesari Chapter-2: దిల్లీలో 'కేసరి చాప్టర్ 2' స్పెషల్ షో... భావోద్వేగానికి గురైన దిల్లీ సీఎం 6 d ago

దిల్లీ సీఎం రేఖ గుప్తా 'కేసరి చాప్టర్ 2' స్పెషల్ షో చూసి భావోద్వేగానికి గురయ్యారు. జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'కేసరి చాప్టర్ 2'.ఈనెల 18న విడుదలకానున్నది. తాజాగా ఈ సినిమా స్పెషల్ షోను దిల్లీలో ప్రదర్శించారు. ఈ చిత్రం దేశభక్తిని చాటి చెబుతోంది. స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల జ్ఞాపకార్థం రూపొందిన ఈ సినిమాతో తాను తన జీవితం మొత్తాన్ని మాతృభూమికి అంకితం చేస్తున్నానని రేఖ గుప్తా పేర్కొన్నారు. ఈ పోస్ట్ ను షేర్ చేసిన అక్షయ్ కుమార్ ఈ సినిమాను నిజమైన వీరులకు నివాళిగా పేర్కొంటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.